logo

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. సోమవారం స్థానిక జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జీఆర్‌పీ వలయాధికారి రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి జీఆర్‌పీ డీఎస్పీ షాను ఆదేశాల మేరకు..

Published : 18 Jan 2022 04:52 IST

నిందితుడ్ని, బంగారాన్ని చూపుతున్న పోలీసులు

రేణిగుంట, న్యూస్‌టుడే: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. సోమవారం స్థానిక జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జీఆర్‌పీ వలయాధికారి రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి జీఆర్‌పీ డీఎస్పీ షాను ఆదేశాల మేరకు.. ఎస్సైలు అనిల్‌కుమార్‌, రవి రైళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తర్‌ఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌ జిల్లా శారయి గ్రామానికి చెందిన మాలిక్‌ గుల్ఫమ్‌ కుమారుడు మాలిక్‌ అబ్దుల్‌రెహ్మన్‌ కోసం ఆర్పీఎఫ్‌ పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినట్లు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక సంతగేటు సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.3.45 లక్షలు విలువైన 165 గ్రాముల బంగారం, 85 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారం నిందితుడిని నెల్లూరు న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై గూడురు, ఒంగోలు, విజయవాడ జీఆర్‌పీ స్టేషన్లల్లో కేసులు నమోదైనట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని