logo

ఎస్‌డీపీఎల్‌, పీఎఫ్‌ఐ సంస్థలతో చర్చలా?

కేరళ ప్రభుత్వం సైతం నిషేధిత జాబితాలో పెట్టిన ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ సంస్థల సభ్యులకు తేనీటి విందు ఇచ్చి రాష్ట్ర హోం మంత్రి సుచరిత చర్చలు జరపడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల

Published : 20 Jan 2022 05:26 IST


సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడు

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: కేరళ ప్రభుత్వం సైతం నిషేధిత జాబితాలో పెట్టిన ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ సంస్థల సభ్యులకు తేనీటి విందు ఇచ్చి రాష్ట్ర హోం మంత్రి సుచరిత చర్చలు జరపడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్‌డీపీఐ సంస్థలు ఆగస్టు 2020లో బెంగళూరులో జరిగిన అల్లర్లలో స్వయంగా పాలుపంచుకున్నట్లు ఎన్‌ఐఏ నిర్ధారించిందన్నారు. సంక్రాంతి సందర్భంగా సొంత ఫంక్షన్‌ హాల్‌లో అసాంఘిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ, ఓటు బ్యాంకు రాజకీయ విధానాలను నిరసిస్తూ ఈ నెల 22న కర్నూలు కేంద్రంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు నీలకంఠ, విశ్వనాథ్‌, దాము రాయల్‌, షేక్‌ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని