logo

కురవంకపై కన్ను

మదనపల్లె గ్రామీణ పట్టణంలోని భూముల విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ డీకేటీ స్థలాలు, వంకలు, చెరువుల స్థలాలపై పడుతోంది. దీనికి నిదర్శనమే కదిరిరోడ్డులోని కురవంక. గతంలో రెవెన్యూ అధికారులు దీనిని స్వాధీనం చేసుకుంటే ప్రస్తుతం మళ్లీ ఆక్రమణపర్వానికి

Published : 21 Jan 2022 02:24 IST

స్వాధీనం చేసుకున్నా ఆగని ఆక్రమణ

ప్రస్తుతం చదును చేశారిలా.. u 2020 నవంబరులో కురవంకలో పనులను అడ్డుకున్న అప్పటి తహసీల్దార్‌ కుప్పుసామి

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ పట్టణంలోని భూముల విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ డీకేటీ స్థలాలు, వంకలు, చెరువుల స్థలాలపై పడుతోంది. దీనికి నిదర్శనమే కదిరిరోడ్డులోని కురవంక. గతంలో రెవెన్యూ అధికారులు దీనిని స్వాధీనం చేసుకుంటే ప్రస్తుతం మళ్లీ ఆక్రమణపర్వానికి తెరదీశారు అక్రమార్కులు. మదనపల్లె కదిరిరోడ్డులోని కురవంకలో కొందరు అక్రమంగా వంకను పూడ్చేసి వెనుక ఉన్న ఓ ఇంటి నిర్మాణానికి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 2020లో అప్పటి తహసీల్దార్‌ కుప్పుస్వామి, రెవెన్యూ, సర్వే అధికారులు వంకను, రెవెన్యూ దస్త్రాలు పరిశీలించి ఆక్రమణగా గుర్తించారు. ఈ మేరకు నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు, పూడికలను జేసీబీతో తొలగించారు. అనంతరం దీనిపై రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తిరిగి ఆక్రమణదారులు సంబంధిత స్థలంలో మట్టి పోసి చదును చేశారు. గతంలో ప్రహరీ నిర్మించగా, నేడు వంకలోకి మట్టి తోలి 60 అడుగుల నుంచి 90 అడుగుల వెడల్పు ఉన్న వంకను కనీసం 8 అడుగులు కూడా లేకుండా ఆక్రమించేశారు. దాదాపు 10 కుంటలకు పైగా స్థలం కబ్జాబకు గురైనట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని స్థానికుల అంచనా.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..

క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ దస్త్రాలు తనిఖీ చేస్తాం. ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. వీఆర్వోల పర్యవేక్షణ ఉండేవిధంగా చూస్తాం. - శ్రీనివాసులు, తహసీల్దార్‌, మదనపల్లె

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని