logo

76 బస్సుల యజమానులపై కేసులు : డీటీసీ బసిరెడ్డి

జిల్లాలో సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 76 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసి పన్నులు, జరిమానాలు, కాంపౌండ్‌ ఫీజుల కింద రూ.6.73 లక్షలు వసూలు చేశామని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. చిత్తూరులోని రవాణాశాఖ ఉప కమిషనర్‌ కార్యాలయంలో గురువారం

Published : 21 Jan 2022 02:24 IST

చిత్తూరు(నేరవార్తలు): జిల్లాలో సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 76 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసి పన్నులు, జరిమానాలు, కాంపౌండ్‌ ఫీజుల కింద రూ.6.73 లక్షలు వసూలు చేశామని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. చిత్తూరులోని రవాణాశాఖ ఉప కమిషనర్‌ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ ముందు రోజే ఎంవీఐలు, ఏఎంవీఐలను అప్రమత్తం చేశామన్నారు. చిత్తూరు, తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సహా పొరుగు జిల్లాలకు వెళ్లే అన్ని ప్రైవేటు బస్సులు తనిఖీ చేశామన్నారు. మొత్తం 76 బస్సులు నిబంధనలు అతిక్రమించాయని, దీంతో వాటికి పెనాల్టీ రూపంలో రూ.5.10లక్షలు, కాంపౌండ్‌ ఫీజు రూపంలో రూ.1.63 లక్షలు వసూలు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని