logo

గృహ లబ్ధిదారులకు రూ.350 కోట్ల చెల్లింపు

జిల్లాలో మొదటి విడత జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్లకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ.350.91 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ డైరెక్టర్‌ కారపాకుల భాస్కరనాయుడు తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జిల్లాకు 1,74,240 ఇళ్లు

Published : 21 Jan 2022 02:24 IST
మాట్లాడుతున్న భాస్కర నాయుడు, ఏఈ సుబ్బారెడ్డి

పీలేరు: జిల్లాలో మొదటి విడత జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్లకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ.350.91 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ డైరెక్టర్‌ కారపాకుల భాస్కరనాయుడు తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జిల్లాకు 1,74,240 ఇళ్లు మంజూరు కాగా 1,172 పూర్తయ్యాయి. 39,647 ఇళ్లకు ఇంకా పునాదులు వేయలేదు. 59,446 ఇళ్లకు పునాదులు తీయగా.. 31,017 పునాదులు పూర్తి చేశారు. 6,676 ఇళ్లకు గోడలు, 8,774 ఇళ్లకు పైకప్పులు వేశార’ని వివరించారు. ఇంకా పేదలు ఇళ్లు పొందేందుకు అర్హులుంటే వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు ఇస్తే అధికారులు ఎంపిక చేస్తారన్నారు. పీలేరు గృహనిర్మాణశాఖ ఏఈ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని