logo

పాజిటివిటీ 56.21%

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోంది.. ఏడు రోజుల్లోనే 10,446 కేసులు నమోదవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. గత నెలలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. కొవిడ్‌ వార్డుల పడకలు

Updated : 22 Jan 2022 06:00 IST

7 రోజులు.. 10,446 కేసులు

తగ్గుతున్న నిర్ధారణ పరీక్షలు

న్యూస్‌టుడే, చిత్తూరు (వైద్యవిభాగం) జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోంది.. ఏడు రోజుల్లోనే 10,446 కేసులు నమోదవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. గత నెలలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. కొవిడ్‌ వార్డుల పడకలు బాధితులతో నిండిపోతున్నాయి.. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుంటే.. మరికొందరు సొంత వైద్యంతో స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

బాధితులు పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళుతుంటే అక్కడ కిట్ల కొరత వారిని తిప్పలు పెడుతోంది. దీంతో పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. ఉన్న కొన్ని కిట్ల ద్వారా చేసే పరీక్షల్లోనూ పాజిటివ్‌ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఈనెల 15 నుంచి 21వరకు 18,582 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. అందులో 10,446 మందికి పాజిటివ్‌గా నమోదైంది. ఈ లెక్కన వారం రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో 56.21 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొవిడ్‌ పరీక్షల కిట్లు అందుబాటులో ఉంటే ఇంకెన్ని కేసులు నమోదవుతాయనేది అధికారులకే తెలియాలి.

తిరుపతిలోనే అధికం

చిత్తూరు(వైద్యవిభాగం): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 1,585 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు. తిరుపతిలో 416, చిత్తూరులో 175, మదనపల్లెలో 118, కుప్పంలో 81, చంద్రగిరిలో 61, పూతపల్టులో 41, శ్రీకాళహస్తిలో 39, పుత్తూరులో 37, పీలేరులో 34, పాకాలలో 31, శాంతిపురంలో 27, బంగారుపాళ్యంలో 25, పుంగనూరు, జీడీనెల్లూరులో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని