logo

రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్‌

రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మండల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు, చెరు

Published : 22 Jan 2022 05:59 IST

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మండల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, సామూహిక ఆస్తులు కాపాడాలని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉంటే వాటిని తక్షణమే తొలగించాలన్నారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్ణయాలు తీసుకునే హక్కు తహసీల్దారుకు ఉందని, మండల స్థాయిలో ఆక్రమణ తొలగింపునకు వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. జేసీ (రెవెన్యూ) రాజాబాబు మాట్లాడుతూ స్పందన, సచివాలయాల నిర్వహణ, రెవెన్యూ రికార్డులు భద్రపరచడం, భూ రికార్డుల స్వచ్ఛీకరణ, జగనన్న కాలనీలకు సంబంధించి మ్యూటేషన్‌ తదితర నివేదికలు త్వరగా సమర్పించాలన్నారు. డీఆర్‌వో మురళి మాట్లాడుతూ రిజిస్టర్‌-ఏలోని భూములపై జిల్లాలోని 480 గ్రామాల్లో చేపట్టిన సర్వే వేగవంతం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని