logo

మహమ్మారిపైఅప్రమత్తం

కరోనా కేసులు పెరగడం.. ముక్కంటి ఆలయంలో పనిచేసే పలువురు మహమ్మారి బారిన పడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే సప్తగోకులం,

Published : 22 Jan 2022 05:59 IST

కరోనా కేసులు పెరగడం.. ముక్కంటి ఆలయంలో పనిచేసే పలువురు మహమ్మారి బారిన పడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే సప్తగోకులం, ప్రసాదాలు, పూజా కౌంటర్లు, మహద్వారం, స్వామి, అమ్మవార్ల ఆలయంలోని క్యూలైన్లు, తదితర ప్రాంతాల్లో శుక్రవారం రసాయనాలను పిచికారీ చేయించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

-న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని