logo

ఉద్యోగ వ్యతిరేక విధానాల్ని విడనాడాలి

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా శుక్రవారం తిరుపతి ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిర

Published : 22 Jan 2022 05:59 IST


నినాదాలు చేస్తున్న సురేష్‌బాబు తదితరులు

తిరుపతి(వీవీమహల్‌): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా శుక్రవారం తిరుపతి ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులతో చర్చించకుండా విడుదల చేసిన పీఆర్‌సీని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఫిట్‌మెంట్‌ను తగ్గించడం, హెచ్‌ఆర్‌సీ 8 శాతానికి నిర్ణయించడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గిరిబాబు, బాలాజీ, శ్రీనివాసులు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు