logo

బంకుల్లో నిబంధనలుతూచ్‌..!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని వినియోగదారుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు రోజు రోజుకు పెంచుతున్నారు. వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అడపదడపా

Published : 22 Jan 2022 05:59 IST

పుత్తూరు పరిధిలోని పెట్రోల్‌ బంకుకు కనీసం షెల్టరు లేని దృశ్యం

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని వినియోగదారుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు రోజు రోజుకు పెంచుతున్నారు. వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అడపదడపా పౌరసరఫరాలశాఖ అధికారులు దాడులు నిర్వహించి చేతులు దులుపుకోవడం గమనార్హం.

న్యూస్‌టుడే, పుత్తూరు : పెట్రోల్‌ బంకుల్లో అందించే సేవల గురించి చాలా మందికి తెలియదు. అధికారులు వినియోగదారులను చైతన్యపరచరు. వాహనాల టైర్లకు గాలి చెక్‌ చేయాలి. అయితే చాలా బంకుల్లో గాలి నింపే యంత్రాలున్నా అలంకారప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. అవి అరకొరగానే ఉన్నాయి. ఉన్నచోట్ల తాళాలు వేస్తున్నారు. ఇక వాహనదారులకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత డీలర్లపై ఉంది. కాని కొన్ని చోట్ల సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. వాహనదారులు ఏదైనా అనుకోని సంఘటనవల్ల గాయపడితే బంకుల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో మందులు కాలపరిమితికి లోబడి ఉండాలి. ఎక్కడా అవి అందుబాటులో లేవు. జిల్లాలో 316 బంకులుంటే 10 శాతం మాత్రమే నిబంధనలను పాటిస్తున్నాయి.

 

అగ్నిప్రమాదాలపై చర్యలు లేవు

ముఖ్యంగా పెట్రోల్‌ బంకు వద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే వాటిని అదుపు చేసేందుకు ఇసుక, నీరు, యంత్రాలను అందుబాటులో ఉంచాలి. జిల్లాలోని 50 శాతం బంకుల్లో కనీసం ఇసుక ఏర్పాటు చేయకపోవడం విస్మయం కలిగించే విషయం.

పత్తాలేని ఫిర్యాదు పుస్తకం

వినియోగదారులతో బంకు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. వారు ఉచిత సౌకర్యాలన్నింటినీ వినియోగించుకోడానికి సహకరించాలి. ఇంధనాల నాణ్యత, కచ్చితత్వంతో సరైన ధరకు అందివ్వాలి. పనివేళలు, డీలరు పేరు, ఫోన్‌ నంబరు, సంస్థ, సంస్థ ఫోన్‌ నంబరును ప్రదర్శించాలి. లేకుంటే ఫిర్యాదుల పుస్తకంలో పేర్కొనే హక్కు ఉంటుంది. ఫిర్యాదు పుస్తకం ఎక్కడా కనిపించడంలేదు.

తనిఖీలు చేస్తాం : డీలర్లు వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం. తరచూ తనిఖీలు చేసి సౌకర్యాలు కల్పించని వారిపై చర్యలు తీసుకుంటాం. - కోదండరామిరెడ్డి, డీఎస్‌వో

 

జిల్లాలో బంకుల వివరాలు

ఈఎస్‌ఎస్‌ఆర్‌ 31

బీపీసీఎల్‌ 70

హెచ్‌పీసీఎల్‌ 80

ఐవోసీఎల్‌ 126

రియలన్స్‌ 9

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని