logo

నిధుల దుర్వినియోగంపై విచారణ

బి.కొత్తకోట నగర పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఇప్పటికే రెండు మూడు విచారణలు జరిగిన నేపథ్యంలో ఆయన రికార్డులను పరిశీలించారు. గతంలో పంచాయతీ ఖాతాలో ఉన్న

Published : 22 Jan 2022 05:59 IST


అధికారులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట నగర పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఇప్పటికే రెండు మూడు విచారణలు జరిగిన నేపథ్యంలో ఆయన రికార్డులను పరిశీలించారు. గతంలో పంచాయతీ ఖాతాలో ఉన్న రూ.1.92 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతుండగా.. అందులో రూ.52 లక్షల నిధులు డ్రా వివరాలు అధికారులు చూపలేకపోయారు. ఈ వ్యవహారంలో ఎనిమిది మంది పంచాయతీ సిబ్బంది ప్రమేయం ఉందని గుర్తించారు. దీనిపై జడ్పీ సీఈవో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ నిధుల వ్యయంపై ఆడిటింగ్‌శాఖ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగర పంచాయతీ కమిషనరు బి.వెంకట్రామయ్య, ఎంపీడీవో శంకరయ్య, ఈఓపీఆర్‌డీ అశ్విని, మండల పరిషత్తు ఏవో థామస్‌రాజ్‌, ఈవో పవన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని