logo

ఉద్యమ స్ఫూర్తి.. గణతంత్ర కీర్తి

స్వాతంత్య్ర సమరోత్సాహంలో పాల్గొన్న తెలుగు తేజాలు ఎందరో ఉన్నారు. వారి ఉద్యమస్ఫూర్తికి కలంకారీ చిత్రరూపంలో జీవం పోశారు సుధీర్‌. ఆయన మిత్రబృందంతో కలిసి వేసిన చిత్రం మరో నాలుగు రోజుల్లో రాజ్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలల్లో ప్రదర్శనకు ఎంపికైంది.

Published : 22 Jan 2022 05:59 IST

శ్రీకాళహస్తి కలంకారీ ప్రశస్తి

ఉద్యమనేతలతో కలంకారీ చిత్రం వేస్తున్న సుధీర్‌

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి : స్వాతంత్య్ర సమరోత్సాహంలో పాల్గొన్న తెలుగు తేజాలు ఎందరో ఉన్నారు. వారి ఉద్యమస్ఫూర్తికి కలంకారీ చిత్రరూపంలో జీవం పోశారు సుధీర్‌. ఆయన మిత్రబృందంతో కలిసి వేసిన చిత్రం మరో నాలుగు రోజుల్లో రాజ్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలల్లో ప్రదర్శనకు ఎంపికైంది.

వ్యవసాయాధారిత కుటుంబానికి చెందిన సుధీర్‌కు హస్తకళలంటే ఇష్టం. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో బ్యాచిలర్‌ ఇన్‌ విజువల్‌ ఆర్ట్‌ విద్యను పూర్తి చేశారు. శ్రీకాళహస్తి కలంకారీకి మోడరన్‌ ఆర్ట్‌ను మేళవించి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు జీవం పోశారు. ఆయన సతీమణి జమున కలంకారీలో ప్రావీణ్యం పొందారు. రేణిగుంటలో నివాసముంటూ శ్రీకాళహస్తిలో కళాకారులకు శిక్షణ ఇస్తూ నూతన డిజైన్లతో ఉపాధిని పొందుతున్నారు.

‘ఉమ్మడి’ అవకాశం: సుధీర్‌తో పాటు అతని మిత్రబృందం వేసిన కలంకారీ చిత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దిల్లీలో జరిగే మోడరన్‌ ఆర్ట్‌ గ్యాలరీకి ఎంపికైంది. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్‌పథ్‌లో నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌ 750 మీటర్ల పొడవుతో భారీ స్క్రోల్‌ ప్రదర్శనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 500 మంది కళాకారులచే చిత్రీకరించిన చిత్రాలు ఉంచాలని నిర్ణయించింది. ఈ కోవలోనే శ్రీకాళహస్తికి చెందిన సుధీర్‌ దరఖాస్తు చేసుకున్నారు. 30 మీటర్ల పొడవు కల్గిన కలంకారీ వస్త్రంపై స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైన తెలుగుతేజాలు అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, పింగళివెంకయ్య తదితర దేశభక్తుల చిత్రాలతో పెయిటింగ్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రం గ్యాలరీలో ప్రదర్శించేందుకు అర్హత సాధించింది.

సుధీర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు