logo

పీఆర్సీ జీవోలు రద్దు చేయాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ రాఘవులు డిమాండ్‌ చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వ్యతిరేక

Published : 24 Jan 2022 05:01 IST

భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చ


సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఐకాసజిల్లా ఛైర్మన్‌ రాఘవులు

చిత్తూరు జడ్పీ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ రాఘవులు డిమాండ్‌ చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వ్యతిరేక ఉత్తర్వులన్నింటినీ రద్దు చేయాలన్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలో వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 78 సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి సమష్టిగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని తీర్మానం చేశామన్నారు. ఈ నెల 20న కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం కాగా ఆ స్ఫూర్తితో జిల్లాలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు. ఆమోదకరమైన పీఆర్సీ ప్రకటించేందుకు అశుతోష్‌మిశ్రా నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయని చెప్పారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా, 27 నుంచి 30వరకు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రసాద్‌రెడ్డి, రఘు, పీఎంఆర్‌ ప్రభాకర్‌, చెంచురత్నం, సుబ్రహ్మణ్యం, శివయ్య, జీవీ రమణ, మధుసూదన్‌, రెడ్డిశేఖరరెడ్డి, చెంగల్రాయమందడి, ఉమాపతి, సమీర్‌, మురళీ, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని