logo

ఘనంగా నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పరుచూరి శివకుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మార్కెట్‌ యార్డు వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌

Published : 24 Jan 2022 05:05 IST


అన్నదానం చేస్తున్న నరసింహయాదవ్‌

తిరుపతి నగరం, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పరుచూరి శివకుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మార్కెట్‌ యార్డు వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌, నాయకుడు కృష్ణయాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిలారీ వెంకటేష్‌, ధనంజయనాయుడు, ప్రతాప్‌, రవిమోహన్‌, వెంకటేష్‌, రమేష్‌నాయుడు పాల్గొన్నారు.

l తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, ఆ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పాల్గొని కేక్‌ కోశారు. తెదేపా నాయకులు మునికృష్ణ, భాస్కర్‌యాదవ్‌, మురళీకృష్ణారెడ్డి, బీఎల్‌ సంజయ్‌, శ్రీధర్‌వర్మ, డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, సురా సుధాకర్‌రెడ్డి, మధుబాబు, శేషాద్రినాయుడు, రామ్మోహన్‌, భాను పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని