logo

31న చలో విజయవాడ

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 31న తలపెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని సంఘం అసోసియేషన్‌ రాష్ట్ర జేఏసీ ఛైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఎంబీ భవన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు జిల్లా అధ్యక్షుడు

Published : 24 Jan 2022 05:05 IST


సదస్సులో మాట్లాడుతున్న ఏవీ నాగేశ్వరరావు

తిరుపతి నగరం, న్యూస్‌టుడే: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 31న తలపెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని సంఘం అసోసియేషన్‌ రాష్ట్ర జేఏసీ ఛైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఎంబీ భవన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు జిల్లా అధ్యక్షుడు గండికోట నాగ వెంకటేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరించారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో నాయకులు కృష్ణమూర్తి, లోకేష్‌బాబు, ఈశ్వర్‌కుమార్‌, నారాయణ, గుణశేఖర్‌, చిన్నబాబు, సురేంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని