logo

దారి కంకర తేలి !

జిల్లావ్యాప్తంగా గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు పడి.. ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా పల్లెవాసులు మండల కేంద్రాలకు చేరుకోవాలంటే అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పంచాయతీరాజ్‌ రోడ్లు.. అర్ధాంతరంగా

Published : 24 Jan 2022 06:36 IST

బిల్లుల భయంతో అసంపూర్తిగా రోడ్లు 
రాకపోకలకు గ్రామీణుల అవస్థలు

కంకర తేలిన చిత్తూరు నుంచి  194.వెంకటాపురానికి వెళ్లే మార్గం 

ఈనాడు డిజిటల్, చిత్తూరు  జిల్లావ్యాప్తంగా గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు పడి.. ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా పల్లెవాసులు మండల కేంద్రాలకు చేరుకోవాలంటే అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పంచాయతీరాజ్‌ రోడ్లు.. అర్ధాంతరంగా ఆగిపోయాయి. కంకర తేలిన రహదారులపై ప్రయాణమంటే ప్రజలు హడలెత్తుతున్నారు. ఫలితంగా వివిద పనుల నిమిత్తం గ్రామీణ ప్రజలు మండల కేంద్రాలకు చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణానికి ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 
ఎన్నికల షెడ్యూల్‌ రాకతో..
గత ప్రభుత్వ హయాంలో మారువ΄ల గ్రామాలతోపాటు అధ్వానంగా ఉన్న రహదారుల స్థానంలో నూతనంగా తారురోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే ఆయా మండలాల నుంచి ప్రతిపాదనలు కోరారు. వాటిని పరిశీలించిన అనంతరం పలు పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ప్రధానంగా గంగాధరనెల్లూరు, నగరి, సత్యవేడు, పలమనేరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా గ్రామీణ రహదారులు మంజూరయ్యాయి. గుత్తేదారులు పనులు దక్కించుకొని.. నిర్మాణాలు ప్రారంభించారు. చాలాచోట్ల గ్రావెల్‌ పరిచి.. కంకర వేశారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే సకాలంలో మండల కేంద్రాలకు చేరుకోవచ్చని ఆయా గ్రామస్థులు భావించారు. ఇంతలోనే సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి.  
వేచిచూసే ధోరణి
ఎన్నికల ఫలితాల అనంతరం గుత్తేదారులు అర్ధాంతరంగా ఆగిన పనులను కొనసాగించాలని చూసినా.. బిల్లులు వస్తాయో లేదో అన్న సందిగ్ధంలో పడ్డారు. ప్రధానంగా పీలేరు, గంగాధరనెల్లూరు, పలమనేరు, నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో పనులు నిలిపేశారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రం కొంతకాలం నిర్మాణాలు ఆగిపోయినా.. అక్కడి ప్రజాప్రతినిధులు వీటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. అక్కడ పనులు పూర్తయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో అధికశాతం మంది గుత్తేదారులు బిల్లులపై స్పష్టత వచ్చే వరకు వేచి చూద్దామనే ధోరణిని అనుసరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రెండున్నరేళ్లుగా గ్రామీణ రహదారుల నిర్మాణం పెండింగ్‌లోనే పడ్డాయి. ఫలితంగా కంకర పరిచిన రోడ్లపైనే గ్రామాల్లోని ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు రహదారి మధ్యలో కాకుండా.. చివర నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలు అదుపు తప్పి.. ప్రజలు గాయపడుతున్నారు.
అధిక శాతం పనులు పూర్తి చేశాం 
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పంచాయతీరాజ్‌ రోడ్డు పనులు అధిక శాతం పూర్తి చేశాం.  ఎక్కడైనా పూర్తి కాకుంటే స్థానిక అధికారులతో మాట్లాడతాం. -అమరనాథరెడ్డి, ఎస్‌ఈ పంచాయతీరాజ్‌

ఈ చిత్రంలోనిది పెనువ΄రు-పుత్తూరు రోడ్డు నుంచి గుంటూరు వాండ్ల ఊరు వెళ్లే రహదారి. సుమారు కిలోమీటరుకుపైగా ఉన్న ఈ మార్గంలో వ΄డేళ్ల క్రితం కొంతదూరం కంకర తోలి వదిలేశారు. మిగతా భాగంలో గుంతలు పడి.. గ్రామస్థులు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఇదే నియోజకవర్గంలో రూ.8 కోట్లతో చేపట్టిన 10 పనులు ఇలానే పెండింగ్‌లో ఉన్నాయి. 
పీలేరు నియోజకవర్గంలో 491 పనులు చేపట్టగా.. కేవలం 30 శాతం రోడ్లకు సంబంధించిన పనులే పూర్తయ్యాయి. పెండింగ్‌ పనుల విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.  
పలమనేరు నియోజకవర్గంలో 87 గ్రామీణ రహదారులు మంజూరు కాగా.. రూ.123 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని