Updated : 25 Jan 2022 13:55 IST
మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి
మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సాధన కమిటీ నాయకులు గౌతమ్, సుదర్శన్ మాట్లాడుతూ.. దేశంలోనే మదనపల్లె అతి పెద్దదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన జేఏసీ నాయకులు నాగేశ్వర్రావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Tags :