logo

ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్‌

ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌ చెప్పారు. తిరుపతిలోని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలో చామల అటవీ రేంజ్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రిజర్వు ఎస్సైలు లింగాధర్‌,

Published : 26 Jan 2022 04:35 IST


స్వాధీనం చేసుకున్న దుంగలు, అదుపులోకి తీసుకున్న స్మగ్లర్లతో టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌, అధికారులు

జీవకోన(తిరుపతి): ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌ చెప్పారు. తిరుపతిలోని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలో చామల అటవీ రేంజ్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రిజర్వు ఎస్సైలు లింగాధర్‌, సురేష్‌ నేతృత్వంలో 15 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించాం. తొమ్మిది మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళ్లడం గమనించి దాడులు నిర్వహించారు. ఆరుగురు స్మగ్లర్లను అదుపులోనికి తీసుకుని, వాహనాన్ని, మూడు గొడ్డళ్లను, 8 దుంగలను స్వాధీనం చేసుకున్నాం. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా జమునమత్తూరుకు చెందిన రమేష్‌, దొరస్వామి, పొన్నుస్వామి, ఆనందన్‌, కుమారస్వామి, ఆదిలగన్‌గా గుర్తించాం. వీరిని విచారించగా కూలికి వచ్చామని, అడవిలో దాచి పెట్టిన దుంగలను తరలించుకుపోవడానికి లారీని తీసుకు వచ్చినట్టు వారు చెప్పారని డీఎస్పీ వివరించారు. కేసును సీఐ చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో సీఐ వెంకట్‌రవి, ఎఫ్‌ఆర్వో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు