logo

Andhra News: మాది లవ్‌ మ్యారేజ్‌.. నా భర్త ఆచూకీ తెలపండి

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని, అత్తింటివారే అతన్ని దాచిపెట్టారని తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సనా గురువారం మదనపల్లె మండలం దిగువగాండ్లపల్లెలోని భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేసింది. బాధితురా

Updated : 11 Mar 2022 07:22 IST

అత్తింటి ఎదుట యువతి ఆందోళన

వివాహం సమయంలో మహమ్మద్‌ సనా, రమేష్‌కుమార్‌ (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని, అత్తింటివారే అతన్ని దాచిపెట్టారని తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సనా గురువారం మదనపల్లె మండలం దిగువగాండ్లపల్లెలోని భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేసింది. బాధితురాలు మాట్లాడుతూ.. ‘2019లో నేను ఈసెట్‌ శిక్షణలో ఉండగా రమేష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 4న మదనపల్లె మండలంలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం. మరుసటి రోజు నుంచే అత్తింటి వారు నాకు ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఇటీవల మదనపల్లె ఎస్టేట్‌లో ఓ అద్దె ఇంటికి వెళ్లాం. మూడు రోజుల కిందట రమేష్‌కుమార్‌ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అత్తింటివారిని అడిగితే మాకు తెలియదని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని సనా వివరించారు. మతాంతర వివాహం చేసుకోవడంతో అత్తింటి వారు తనను గృహహింస పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్‌కుమార్‌ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు వైకాపా నాయకులు తనను బెదిరించడంతో పాటు కొట్టారని, తాను వెళ్లనని పట్టుబట్టడంతో ఇలా చేశారని.. తన భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని ఆమె కోరారు. అత్తింటివారు మాట్లాడుతూ.. సనా కుటుంబ సభ్యులే రమేష్‌కుమార్‌ను ఏదైనా చేసుంటారని ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మహమ్మద్‌ సనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని