logo

RRR Movie: శ్రీకాళహస్తిలో ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్ల గొడవ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చలనచిత్రం విడుదలకు ముందే అభిమానులు గొడవకు దిగారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడం.. పరోక్షంగా రాజకీయ నేతల హస్తం ఉండటంతో

Updated : 25 Mar 2022 07:47 IST


థియేటర్‌ వద్ద పోలీసుల బందోబస్తు

 

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చలనచిత్రం విడుదలకు ముందే అభిమానులు గొడవకు దిగారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడం.. పరోక్షంగా రాజకీయ నేతల హస్తం ఉండటంతో స్థానిక థియేటర్‌ వద్ద గందరగోళ పరిస్థితి కనిపించింది. తొలుత ఓ హీరో అభిమానులు వచ్చి సింహభాగం టికెట్లు తమకే ఇవ్వాలని పట్టుబట్టగా ఇది తెలుసుకున్న మరోవర్గం అభిమానులు గొడవకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారి థియేటర్‌లో ఓతలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను అభిమానులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు యత్నించారు. థియేటర్‌ వద్ద పరిస్థితి ఇలా ఉంటే చలనచిత్రం విడుదల సందర్భంగా పద్మశాలిపేటకు చెందిన కొందరు ఇద్దరు కథానాయకుల ఫొటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హీరోల చిత్రాలకు రక్తతిలకం దిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని