logo

నేరం జరిగిన పదిరోజుల్లో ఛార్జిషీట్‌: డీజీపీ

నేరం జరిగిన పదిరోజుల్లోపు ఛార్జిషీట్‌ దాఖలు చేసి కేసుల పురోగతి చూపాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి ఎస్వీయూ సెనెట్‌హాల్‌లో శనివారం సమీక్ష నిర్వహిం

Published : 22 May 2022 04:50 IST


సీఐ అంజుయాదవ్‌కు మెడల్‌ అందిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: నేరం జరిగిన పదిరోజుల్లోపు ఛార్జిషీట్‌ దాఖలు చేసి కేసుల పురోగతి చూపాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి ఎస్వీయూ సెనెట్‌హాల్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. నేరాల తీవ్రత పెరగకుండా ప్రాథమిక దశలోనే పోలీసులు చొరవ తీసుకోవాలని సూచించారు. నేర పరిశోధనలో సందర్భోచితంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు తొలగిపోకుండా.. మాయం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసును కొత్తగా భావించి పరిశోధన జరపాలన్నారు.

డీజీపీ మెడల్‌ బహూకరణ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి డీజీపీ కమాండేషన్‌ డిస్క్‌ మెడల్‌ను బహూకరించారు. విశాంత్ర డీఎస్పీ రామ్‌ మోహన్‌, రేణిగుంట సీఐ అంజుయాదవ్‌, డీసీఆర్‌బీ ఏఎస్‌ఐ ప్రసాద్‌ రాజు, శ్రీకాళహస్తి 1టౌన్‌ హెచ్‌సీ శ్రీధర్‌బాబు, ఆర్‌సీపురం పీసీ ధనంజయ, ఏఆర్‌పీసీ చంద్రశేఖర్‌లకు మెడల్‌ అందజేశారు. కార్యక్రమంలో అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వర రెడ్డి, రిషాంత్‌రెడ్డి, టాస్క్‌పోర్స్‌ ఎస్పీ సుందరరావు, అదనపు ఎస్పీలు సుప్రజ, కులశేఖర్‌, మునిరామయ్య, కేవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని