logo

‘ప్రధానోపాధ్యాయుల్లో అభద్రతా భావం కల్పించొద్దు’

వేసవి సెలవుల్లో వ్యక్తిగత వ్యవహారాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు తక్షణమే మండల విద్యాశాఖ కార్యాలయంలో హాజరు కావాలని భయాందోళనకు గురిచేసేలా జిల్లా అధికారులు వ్యవహరించడం అప్రజాస్వామికమని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా

Published : 22 May 2022 04:50 IST

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో వ్యక్తిగత వ్యవహారాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు తక్షణమే మండల విద్యాశాఖ కార్యాలయంలో హాజరు కావాలని భయాందోళనకు గురిచేసేలా జిల్లా అధికారులు వ్యవహరించడం అప్రజాస్వామికమని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ గత ఆరు నెలలుగా చేపడుతున్నారని, వాటి వివరాలు పలుమార్లు హెచ్‌ఎంలు సమర్పించారన్నారు. అడిగిన డేటానే పదేపదే అడుగుతూ గంటల వ్యవధిలో సమర్పించకపోతే చర్యలకు సిఫార్సు చేస్తామని సందేశాలు పంపి బెదిరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటివరకు వేసవి సెలవులు ప్రివెంటూ చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకనే సెలవులు అప్పగించి ప్రధానోపాధ్యాయులను మానసికంగా వేధించడం అధికారుల దుందుడుకు చర్యగా పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి చాలా మంది హెచ్‌ఎంలకు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ భయాందోళనకు గురిచేశాయన్నారు. కొందరు ఎంఈవోలు అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని