logo

స్నేహితుడిని కాపాడి తనువు చాలించి..

స్నేహితుడిని కాపాడబోయి విద్యార్థి తనువు చాలించిన ఘటన మండల పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్సై జయరామ్‌నాయక్‌ కథనం మేరకు... చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని ఒట్టిపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి తిరుపతిలో నివాసం ఉంటూ ఓ దుకాణంలో పనిచేస్తు

Published : 22 May 2022 04:50 IST


జ్ఞానశేఖర్‌ మృతదేహం

 

నారాయణవనం, న్యూస్‌టుడే: స్నేహితుడిని కాపాడబోయి విద్యార్థి తనువు చాలించిన ఘటన మండల పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్సై జయరామ్‌నాయక్‌ కథనం మేరకు... చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని ఒట్టిపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి తిరుపతిలో నివాసం ఉంటూ ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు జ్ఞానశేఖర్‌(17) నారాయణవనంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. జ్ఞానశేఖర్‌ శనివారం ఉదయం తిరుపతికి చెందిన తన స్నేహితుడు హరీశ్‌తో పాటు మరికొంత మంది స్నేహితులతో కలిసి కళాశాల సమీపంలోని బ్రాహ్మణతాంగేల్‌ ఒడ్డిఇండ్లు వద్ద ఉన్న వ్యవసాయబావిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈత రాకపోవడంతో హరీశ్‌ బావిలో మునిపోయాడు. హరీష్‌ను కాపాడడానికి జ్ఞానశేఖర్‌ బావిలోకి దిగాడు. హరీశ్‌ ప్రాణాలతో బయటపడేసిన జ్ఞానేశ్వర్‌ నీళ్లు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తోటి స్నేహితులు స్థానికుల సాయం తో జ్ఞానేశ్వర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను మృతి చెందాడు. హరీష్‌ ను ముందుగా పుత్తూరు ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని