logo

పీఎంఏజీవైకి 61 పంచాయతీలు ఎంపిక

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన(పీఎంఏజీవై) పథకం కింద ఎంపికైన 61 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. ఈ పథకం అమలుపై శనివారం జిల్లా సచివాలయలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు

Published : 22 May 2022 04:50 IST


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం): ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన(పీఎంఏజీవై) పథకం కింద ఎంపికైన 61 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. ఈ పథకం అమలుపై శనివారం జిల్లా సచివాలయలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో.. మొదటి ఫేజ్‌లో 22 పంచాయతీలు, రెండో ఫేజ్‌లో 24, మూడో ఫేజ్‌లో 17 గ్రామాలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 108 గ్రామాలు ఈ పథకం కింద ఎంపికైనట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ తులసి, ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ, సీపీవో ఉమారాణి పాల్గొన్నారు.

కలెక్టరేట్‌: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కార్యకలాపాలు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.డీఆర్‌వో రాజశేఖర్‌, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

జూన్‌ 6 నాటికి పునాది స్థాయి దాటాలి

కలెక్టరేట్‌: ప్రభుత్వ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని, ఇప్పటిదాకా నిర్మాణాలు ప్రారంభంకాని భవనాలు జూన్‌ 6 నాటికి పునాది స్థాయి దాటాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని