logo

రోజా పూలు.. రోజూ లాభాలు

ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగు రైతులకు ఊరటనిస్తోంది. రోజా పూలకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నగరాల్లో మంచి గిరాకీ ఉందంటున్నాడు యువ రైతు. మండలంలోని నెక్కుంది పంచాయతీ పెద్ద అల్సాపురం గ్రామంలో యువ రైతు వెంకటరమణ (పండు) అర ఎక

Published : 22 May 2022 04:50 IST


వెంకటరమణ రైతు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగు రైతులకు ఊరటనిస్తోంది. రోజా పూలకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నగరాల్లో మంచి గిరాకీ ఉందంటున్నాడు యువ రైతు. మండలంలోని నెక్కుంది పంచాయతీ పెద్ద అల్సాపురం గ్రామంలో యువ రైతు వెంకటరమణ (పండు) అర ఎకరం కౌలుకు తీసుకుని రూ.40 వేలు పెట్టుబడి పెట్టాడు. దుక్కులు దున్ని దిబ్బ ఎరువు, గొర్రె ఎరువుతో భూమి సత్తువ చేసి గడ్డలు తోలాడు. కర్ణాటక రాష్ట్రం మాలూరు నుంచి ఒక్కో రోజా మొలక రూ.18 చొప్పున 1,000 బటన్‌ రోజా మొక్కలు కొనుగోలు చేసి పొలంలో నాటాడు. బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాడు. మూడు నెలల తరువాత రోజు మార్చి రోజు పది నుంచి 20 కిలోల రోజా పూలు పూస్తున్నాయి. మార్కెట్‌లో కిలో రోజాలకు రూ.80 నుంచి రూ.100 ధర పలుకుతోంది. రోజు మార్చి రోజు పూలు కోసి విక్రయిస్తున్నాడు. ఏడాది పొడువునా పంట ఉంటుందని శుభకార్యాలకు, పండుగల వేళల్లో ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నాడు ఈ యువరైతు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని