logo

ఉచిత బియ్యం ఆగినట్లే..!

Published : 23 May 2022 05:39 IST

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో పేద, నిరుపేదలకు ఆహార భద్రత సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేవై) కింద అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ ఆగిపోయింది. సెప్టెంబరు వరకు అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలోని చౌక దుకాణాలకు చేరలేదు. ఈ నెలలోనూ అదే పరిస్థితి. మే నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం ఈ నెల 17తో ముగియగా.. ఉచిత బియ్యం 18 నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేటాయింపే జరగలేదు. రెండు నెలల ఉచిత బియ్యం ఒకే దఫా ఈ నెలలో అందజేస్తామని అధికారులు తొలుత చెప్పడంతో లబ్ధిదారులు సంతోషపడ్డారు. ఇప్పటివరకు ఉచిత బియ్యం ఊసే లేకపోవడంతో పంపిణీ ఆగినట్లేనని స్పష్టమవుతోంది.

అధికారులు ఏమంటున్నారంటే..

ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి పీఎంజీకేవై బియ్యం కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఉత్తర్వులు రాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ నెల కోటా కేటాయించిందన్నారు. ఉచిత బియ్యం కేటాయింపు జరగలేదని.. ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని డీఎస్‌వో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని