logo

అశ్వ వాహనాలపై ముత్తుమారెమ్మ

కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆదివారం శ్రీప్రసన్న ముత్తుమారెమ్మను రెండు అశ్వవాహనాలపై పట్టణంలో ఊరేగించారు. ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌ మంజునాథ్‌, రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, ఆలయ పాలకవర్గ సభ్యులు రవి, మంగమ్మ, కన్నన్‌,

Published : 23 May 2022 05:53 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆదివారం శ్రీప్రసన్న ముత్తుమారెమ్మను రెండు అశ్వవాహనాలపై పట్టణంలో ఊరేగించారు. ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌ మంజునాథ్‌, రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, ఆలయ పాలకవర్గ సభ్యులు రవి, మంగమ్మ, కన్నన్‌, మహేశ్వరి, జ్యోతి, ఇందుశేఖర్‌, మంజుల పాల్గొన్నారు. జాతరలో భాగంగా బస్టాండు కూడలిలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. రాత్రి జబర్దస్త్‌ షో నటులు హైపర్‌ ఆది, దొరబాబు, రైజింగ్‌ రాజు బృందంతో కామెడీ షో నిర్వహించారు. ఢీ డ్యాన్సర్లు పండు, తేజశ్విని, సాయి నైనిక, ఫైర్‌ రమేష్‌ బృందంతో నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని