logo

మార్చి నెల వేతనాలు మేలో..

సాంకేతిక కారణాలతో నిలిచిన ఉపాధ్యాయుల మార్చి నెల వేతనాలు ఎట్టకేలకు మే నెలలో విడుదలయ్యాయి. పెనుమూరు ఉన్నత పాఠశాలకు చెందిన 28 మంది ఉపాధ్యాయులు మార్చి నెల చివరలో వేతనాల కోసం ఆన్‌లైన్‌లో బిల్లులు పెట్టుకున్నారు. సాంకేతిక సమస్యతో వేతనాలు

Published : 23 May 2022 05:53 IST

పెనుమూరు, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో నిలిచిన ఉపాధ్యాయుల మార్చి నెల వేతనాలు ఎట్టకేలకు మే నెలలో విడుదలయ్యాయి. పెనుమూరు ఉన్నత పాఠశాలకు చెందిన 28 మంది ఉపాధ్యాయులు మార్చి నెల చివరలో వేతనాల కోసం ఆన్‌లైన్‌లో బిల్లులు పెట్టుకున్నారు. సాంకేతిక సమస్యతో వేతనాలు ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ కాలేదు. దీనిపై ‘ఈనాడు’లో ‘మార్చి నెల వేతనాలు అందక ఉపాధ్యాయుల ఇబ్బందులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆయా విభాగాల అధికారులు రంగంలోకి దిగి సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దీంతో సుమారు రూ.25 లక్షల వేతనాలు ఉపాధ్యాయుల ఖాతాల్లోకి చేరాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని