logo

‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌’గా.. ఆశా కార్యకర్తలు

కొవిడ్‌-19 వైరస్‌ వ్యాపిస్తున్న సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించిన ఆశా కార్యకర్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌గా ప్రకటించి పురస్కారం అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా కార్యకర్తలను గుర్తించిన నేపథ్యంలో

Published : 24 May 2022 05:29 IST


రవిరాజు

చిత్తూరు(వైద్యవిభాగం): కొవిడ్‌-19 వైరస్‌ వ్యాపిస్తున్న సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించిన ఆశా కార్యకర్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌గా ప్రకటించి పురస్కారం అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా కార్యకర్తలను గుర్తించిన నేపథ్యంలో జిల్లా టీకాల అధికారి, పీవోడీటీటీ రవిరాజు ఆశా కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో 3,111 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారని.. గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారం ప్రతి ఆశాకార్యకర్తకు లభిస్తుందని చెప్పారు. జిల్లాలో ఆశా కార్యకర్తల సేవలు అమోఘమన్నారు. ప్రసూతి సేవలు, మాతాశిశు మరణాలు తగ్గించడం, డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు కృషి చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కుష్ఠు, క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే ఉచిత మందులను రోగులందరికీ అందించడంలోనూ ముందుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో బాధితులకు సేవలు అందించడం, వ్యాక్సిను అందించడంలో ప్రాణాలు లెక్క చేయక తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించడం హర్షణీయమని కొనియాడారు. అలాంటి సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారం అందించడం సంతోషకరమని తెలిపారు. ఆశా కార్యకర్తలందరూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సేవా గుణాన్ని కొనసాగించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని