logo

మరింత బాధ్యతగా పనిచేయాలి: ఎస్పీ

జిల్లాలో 2020లో నమోదైన ఓ కీలక కేసులో ప్రతిభ చూపిన వివిధ పోలీసుస్టేషన్లకు చెందిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ధ్రువపత్రం, పతకాలతో ప్రశంసించారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ అందించిన ‘డీజీపీ ఎస్‌ కమాండేషన్‌ డిస్క్‌’ ధ్రువపత్రాలను

Published : 24 May 2022 05:29 IST


ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ధ్రువపత్రాలతో సత్కరించిన ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు (నేరవార్తలు): జిల్లాలో 2020లో నమోదైన ఓ కీలక కేసులో ప్రతిభ చూపిన వివిధ పోలీసుస్టేషన్లకు చెందిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ధ్రువపత్రం, పతకాలతో ప్రశంసించారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ అందించిన ‘డీజీపీ ఎస్‌ కమాండేషన్‌ డిస్క్‌’ ధ్రువపత్రాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి సోమవారం పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అందించి అభినందించారు. పతకాలు అందుకున్న వారిలో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, పీలేరు అర్బన్‌ సీఐ సాదిక్‌ అలీ, దిశా మహిళా పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ దేవరాజులురెడ్డి, చౌడేపల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ విశ్వనాథం, మదనపల్లె రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జ్ఞానప్రకాష్‌, మదనపల్లె తాలూకా పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జగదీష్‌, యాదమరి కానిస్టేబుల్‌ రఘురామన్‌, గోపినాథ్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌, దామోదరం, కాణిపాకం కానిస్టేబుల్‌ దిలీప్‌కుమార్‌, తవణంపల్లె కానిస్టేబుల్‌ సుధాకర్‌, చిత్తూరు క్రైం పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ తనికాచలం, పాకాల కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా శిక్షణ కేంద్రం కానిస్టేబుల్‌ ఫల్గుణ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని