logo

వైభవంగా అగ్నిగుండ ప్రవేశం

కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ముందుగా పెద్దబావి వద్ద అమ్మవారి కండ్ల తెర తొలగించి ప్రత్యేక పూజలు చేశారు. 51 పుష్పపల్లకీలను

Published : 24 May 2022 05:29 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ముందుగా పెద్దబావి వద్ద అమ్మవారి కండ్ల తెర తొలగించి ప్రత్యేక పూజలు చేశారు. 51 పుష్పపల్లకీలను అర్ధరాత్రి వరకు ఊరేగించారు. మూడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అగ్నిగుండ ప్రవేశ ప్రాంగణంలో భక్తులు అమ్మవారి వెంట రావడంతో పోలీసులు, భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అమ్మవారి నగలు, సారెను ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ మంజునాథ్, రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్, మున్సిపల్‌ ఛైర్మన్‌ డా.సుధీర్, పాలకవర్గ సభ్యులు పట్టణంలో ఊరేగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని