logo

క్వారీలో గోడ కూలి యువకుడు..

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని పాలెంపల్లె వద్ద ఓ క్వారీలో కార్మికులు నివసించే షెడ్డు గురువారం మధ్యాహ్నం కూలింది. ఈ ప్రమాదంలో బిహార్‌ రాష్ట్రం పంచమిచంపరన్‌ జిల్లా గంగవళియార్‌ గ్రామానికి చెందిన రోహిత్‌(22) మృతిచెందాడు.

Published : 27 May 2022 05:43 IST

మరో అయిదుగురికి గాయాలు


రోహిత్‌ 

పుంగనూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని పాలెంపల్లె వద్ద ఓ క్వారీలో కార్మికులు నివసించే షెడ్డు గురువారం మధ్యాహ్నం కూలింది. ఈ ప్రమాదంలో బిహార్‌ రాష్ట్రం పంచమిచంపరన్‌ జిల్లా గంగవళియార్‌ గ్రామానికి చెందిన రోహిత్‌(22) మృతిచెందాడు. సచిన్, సునీల్, రాజన్‌కుమార్, వివేక్, మనోజ్‌ గాయపడ్డారు. వీళ్లంతా బిహార్‌ రాష్ట్రానికి చెందినవారే. 5 నెలల కిందట ఇక్కడ క్వారీలో పనిచేయడానికి వచ్చారు. పనుల్లో ఉన్న వారందరూ వర్షం రావడంతో షెడ్డులోకి వచ్చారు. షెడ్డు పైకప్పునకు టెంకాయపట్టలు, ప్లాస్టిక్‌ కవర్లు వేసి ఉండడంతో నీరు నిల్వడం, గాలికి పైకప్పు, షెడ్డు గోడ ఒక్కసారిగా కూలాయి. రోహిత్‌ పైన గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత దూరంగా కూర్చొన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. పొట్టకూటి కోసం వచ్చి అశువులుబాయడంతో సహచర కార్మికుల్లో విషాదం నెలకుంది. రోహిత్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని