logo

కాణిపాకం ఆలయ పరిసరాల్లో శిల్పారామం

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పరిసరాల్లో ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శిల్పారామం నిర్మించడానికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ రీజనల్‌ డైరక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా ఆదేశాల మేరకు గురువారం అధికారుల

Published : 27 May 2022 05:43 IST


కాణిపాకంలో పర్యటిస్తున్న పర్యాటకశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పరిసరాల్లో ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శిల్పారామం నిర్మించడానికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ రీజనల్‌ డైరక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా ఆదేశాల మేరకు గురువారం అధికారుల బృందం కాణిపాకంలో పర్యటించింది. ఆయన మాట్లాడుతూ కాణిపాకం పరిసరాల్లో శిల్పారామం నిర్మిస్తే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. పర్యాటకశాఖ తరఫున విశ్రాంతి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమీపంలో ఉన్న చెరువులో బోటింగ్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, మూడు నెలల్లో స్థల సేకరణ చేపట్టి, వచ్చే మార్చి నాటికి శిల్పారామం నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. మంత్రి రోజా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆయన వెంట ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈఈ వెంకట నారాయణ, తిరుపతి శిల్పారామం పరిపాలనాధికారి ఖాదర్‌వల్లి, మోహన్‌కుమార్‌ ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని