logo

లీకేజీకిల భయం.. పొంచి ఉన్న అతిసారం..

నాలుగు రోజుల కిందట వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం అక్కసముద్రంలో పైపులైన్ల లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమై పలువురు అతిసారం బారిన పడ్డారు. కొందరు ప్రైవేటులో వైద్యం చేయించుకున్నారు. మిగిలిన వారు

Published : 28 Jun 2022 04:02 IST
పైపులైన్ల విషయంలో అశ్రద్ధ
కనిపించని శాశ్వత పరిష్కారం
 న్యూస్‌టుడే, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నగరం, కపిలతీర్థం (తిరుపతి)

శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీ వద్ద తరచూ లీకేజీకి గురవుతున్న తాగునీటి పైపులైను

నాలుగు రోజుల కిందట వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం అక్కసముద్రంలో పైపులైన్ల లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమై పలువురు అతిసారం బారిన పడ్డారు. కొందరు ప్రైవేటులో వైద్యం చేయించుకున్నారు. మిగిలిన వారు గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందారు. వర్షాకాలం ఆరంభంలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల ఈ సమస్య వెంటాడుతున్నా ప్రైవేటులో వైద్యం చేయించుకోవడంతో కేసులు బయట పడటం లేదు.

మ్మడి జిల్లాలో పైపులైన్ల లీకేజీలు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్య చిన్నదే కదా అనుకుంటే అతిసారం ప్రబలే అవకాశం ఉంటుంది. ఏటా లీకేజీలు వెంటాడుతున్నా శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు, కుప్పం, పలమనేరు, నగరి, చిత్తూరు నగరపాలక సంస్థలతో పాటు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, పుత్తూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట, తిరుపతి నగర పాలక సంస్థలున్నాయి.

* చిత్తూరు నగర పాలక సంస్థకు పెనుమూరు మండలం కలవకుంట నుంచి నీటిని అందిస్తున్నారు. ఈ నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. ఇక పట్టణ ప్రజలు మినరల్‌ ప్లాంట్ల వద్ద విక్రయించే నీటిని వాడుకుంటుండటం గమనార్హం.

తిరుపతిలో తుప్పుపట్టిన పైపును మార్చుతున్న సిబ్బంది

* తిరుపతి నగర పాలక సంస్థకు తెలుగుగంగ కాలువ నుంచి తాగునీటిని అందిస్తున్నారు. రూ.50 కోట్ల యూడీఎస్‌ నిధులతో మూడు విలీన పంచాయతీలతో పాటు నగరంలో తాగునీటి పైపులైన్ల పనులు చేపట్టారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తరచూ రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు వీధుల్లో వేసిన పైపులైన్ల లీకేజీలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

* వెంకటగిరిలో హనుమాన్‌నగర్‌, మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో తరచూ తాగునీటి పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి.

* గూడూరుకు కండలేరు ప్రాజెక్టు నుంచి రూ.63 కోట్లతో పనులు చేపట్టి తాగునీటిని అందిస్తున్నారు. పనులు నాసిరకంగా సాగడంతో ఇక్కడ అదే పరిస్థితి నెలకొంది.


మరమ్మతులు చేపడుతున్నాం..
- మూర్తి, రీజినల్‌ డైరెక్టర్‌, అనంతపురం

నగరాలు, పట్టణాల్లో లీకేజీ ఉన్న పైపులైన్లు వెంటనే మార్చాలి. సమస్యలు తలెత్తిన వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరా విభాగం డీఈఈలు, ఏఈఈలు వార్డుల్లో పర్యటించి తగిన చర్యలు చేపట్టేలా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని