logo

రూ.68 లక్షల విలువైన మద్యం ధ్వంసం

మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లను, అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తూ

Published : 29 Jun 2022 02:24 IST

రేణిగుంట: మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లను, అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తూ పట్టుబడిన మద్యం సీసాలను స్థానిక గాజులమండ్యం-తండ్లం మార్గంలోని చిన్నచెరువు వద్ద ఎస్‌ఈబీ అధికారుల సమక్షంలో మంగళవారం రోడ్‌ రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు 32,341 (6,797 లీటర్లు)ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీటి విలువ రూ.68 లక్షలు ఉంటుందన్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ స్వాతి, అదనపు ఎస్పీ సుప్రజ, రేణిగుంట గ్రామీణ సీఐ అరోహనరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని