logo

అశేషం.. అమావాస్య జనం

అమావాస్య.. మంగళవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి అశేషంగా జనం తరలివచ్చారు.  రాహు, కేతు పూజలు గణనీయంగా నిర్వహించారు. రూ.500 టికెట్లు 4,043, రూ.750 టికెట్లు 1,528, రూ.1500 టికెట్లు 416, రూ.2500

Published : 29 Jun 2022 02:24 IST

రికార్డు స్థాయిలో దోష పూజలు


మహద్వారం వద్ద  నిరీక్షిస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి: అమావాస్య.. మంగళవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి అశేషంగా జనం తరలివచ్చారు.  రాహు, కేతు పూజలు గణనీయంగా నిర్వహించారు. రూ.500 టికెట్లు 4,043, రూ.750 టికెట్లు 1,528, రూ.1500 టికెట్లు 416, రూ.2500 టికెట్లు 402, రూ.5 వేలు టికెట్లు 102 వెరసి 6,496 టికెట్లు విక్రయించారు. ఆర్జిత సేవలు, ప్రసాద విక్రయాల ద్వారా భారీ ఆదాయం వచ్చింది.  25 వేలకు పైగా భక్తులు ముక్కంటీశుని దర్శించుకున్నారు.

హారతి తట్టలొద్దు: ఆలయంలో ఇటీవల వస్తున్న విమర్శలను నియంత్రించే దిశగా హారతి తట్టలు పట్టవద్దంటూ ఈవో సాగర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలోని స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తుల వద్ద హారతి పళ్లాలు పట్టకూడదని, ఆలయం తరఫున ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు ఏకహారతి ఇవ్వాలని అర్చకులకు సూచనలు చేశారు.

అనధికారిక పూజా సామగ్రితో ఇక్కట్లు: అనధికారిక పూజా సామగ్రిని ఆలయంలోని ప్రవేశ గోపురాల గుండా లోపలకు అనుమతించరు. దళారుల మాట విని అవసరం లేకున్నా దీపాలు, కొబ్బరికాయలు, దారాలు ఇతరత్రా పూజా సామగ్రిని వందలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేయడం, తీరా ప్రవేశ గోపురాల వద్ద వాటిని అనుమతించకపోవడంతో పెట్టిన ఖర్చు వృథా కావడంపై భక్తులు ఆవేదనకు గురవుతున్నారు.

వేడెక్కిన సర్వర్లు..

అమావాస్య, మంగళవారం సందర్భంగా రాహుకాల సమయంలో ఆర్జిత సేవా టిక్కెట్లు పంపిణీ చేసే కౌంటర్లల్లోని సర్వర్లు వేడెక్కాయి. ఊహించని విధంగా భక్తులు గుంపులుగా రావడంతో సర్వర్లు తరచూ మొరాయించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు