logo

సత్తా చాటిన ఇస్రో శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు అనుకున్నారు.. వెంటనే ఆ ఆలోచన దిశగా అడుగులు వేశారు. ఏడాది పాటు చేయాల్సిన పనిని రికార్డు సమయంలో మూడు నెలల్లో రూపొందించి, రెండింటిని ఒకటిగా చేసి, ప్రయోగం చేపట్టి.. అందరితో శెభాష్‌ అనిపించుకున్నారు.

Published : 01 Jul 2022 04:27 IST

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక

శ్రీహరికోట, న్యూస్‌టుడే: శాస్త్రవేత్తలు అనుకున్నారు.. వెంటనే ఆ ఆలోచన దిశగా అడుగులు వేశారు. ఏడాది పాటు చేయాల్సిన పనిని రికార్డు సమయంలో మూడు నెలల్లో రూపొందించి, రెండింటిని ఒకటిగా చేసి, ప్రయోగం చేపట్టి.. అందరితో శెభాష్‌ అనిపించుకున్నారు. ఇస్రోలో ఏదైనా పని చేయాలంటే ఆరు నెలల పైమాటే. అలాంటిది రెండు మిషన్లను ఒకటిగా రూపకల్పన చేసి, తక్కువ ఖర్చుతో 90 రోజులు పూర్తి చేసి, ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఇందులో దేశంలోని ఇస్రో కేంద్రాలకు చెందిన ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేయడమే నిదర్శనం. గురువారం శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి54 రాకెట్‌ ప్రయోగం చేపట్టారు. ఇందులో నాల్గో దశను కొత్త సాంకేతికతను రూపొందించి ఒకే రాకెట్‌ ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి, ఇస్రోకు చెందిన పరిశోధనకు సంబంధించి ఎక్స్‌పర్‌మెంటల్‌ చేపట్టారు.

సందర్శకుల రద్దీ..  రెండేళ్ల తర్వాత రాకెట్‌ ప్రయోగ వీక్షణకు సందర్శకులకు అవకాశం కల్పించడంతో సుదూర ప్రాంతాల నుంచి శ్రీహరికోటకు వేలాది మంది ముందస్తుగా ఆన్‌లెన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. షార్‌లో సందర్శకుల గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. వివిధ కళాశాలల విద్యార్థులు సైతం రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆనందించారు. ప్రయోగం దృష్ట్యా శ్రీహరికోట అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీహరికోట మార్గంలోని అటకానితిప్ప వద్ద స్థానిక పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వేర్వేరుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేపట్టారు. అందర్నీ క్షుణ్నంగా తనిఖీ చేసి లోనికి పంపారు. రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు నెల్లూరు కలెక్టర్‌ చక్రధర్‌బాబు, తిరుపతి జేసీ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచ్చేశారు.


రాకెట్‌ గమనాన్ని తెలియజేస్తున్న అధికారి


మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు


షార్‌ మొదటి గేట్‌ వద్ద విద్యార్థుల సందడి

గ్యాలరీలో వీక్షకుల సందడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని