logo

7కు వచ్చింది నాలుగే

విద్యా సంవత్సరం ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక  పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో   ని పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌, బెల్ట్‌, మూడు జతల సమవస్త్రాలు, బూట్లు, సాక్సులు, నిఘంటువులను ప్రభుత్వ పాఠశాలల్లో

Published : 02 Jul 2022 02:11 IST

ఇదీ విద్యాకానుకల సరఫరా పరిస్థితి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యా సంవత్సరం ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక  పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో   ని పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌, బెల్ట్‌, మూడు జతల సమవస్త్రాలు, బూట్లు, సాక్సులు, నిఘంటువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని యాజమాన్యాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలల పునః ప్రారంభానికి మూడు రోజులే గడువు ఉంది. ఇప్పటి వరకు  నాలుగు రకాల విద్యా సామగ్రి అందినట్లు సమాచారం. ఈ  నేపథ్యంలో  పాఠశాలల పునః ప్రారంభం రోజున పూర్తి స్థాయిలో విద్యా కానుకలు విద్యార్థులకు అందించలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో జగనన్న విద్యాకానుకను 1,82,138మంది ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ వివరాల ప్రకారం వీరందరికి పాఠశాల పునః ప్రారంభం రోజున అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లాకు పూర్తి స్థాయిలో ఏడు రకాల సామగ్రి రాలేదు. కొన్ని పాఠశాలలకు నాలుగు రకాలు, మరికొన్ని పాఠశాలలకు రెండు రకాల సామగ్రి సరఫరా అయ్యింది. మిగిలిన సామగ్రి జిల్లాకు రావాల్సి ఉంది. సామగ్రి వచ్చిన తర్వాత మండల కేంద్రాలకు అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన విద్యాకానుకలో కొన్ని రకాలు నాసిరకం సామగ్రి అందజేశారని పలు ఫిర్యాదులు అందాయి.  ఈ ఏడాది అటువంటి సామగ్రి సరఫరా చేస్తే వెంటనే సంబంధిత వాహనంలోనే తిరిగి పంపించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

విద్యా సామగ్రికి బయోమెట్రిక్‌
విద్యార్థులకు అందజేయనున్న కానుక కోసం సంబంధిత తల్లులు/ సంరక్షకులు బయోమెట్రిక్‌ హాజరు వేసిన తర్వాత ఆ సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌కు అవసరమైన యంత్రాలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు. శనివారం విద్యా కానుకలో ఇంకా రావాల్సిన సామగ్రి సరఫరా అవుతుందని, ఆదివారం మండల కేంద్రాలకు వాటిని పంపించి అక్కడి నుంచి పాఠశాలలు సరఫరా చేస్తామని విద్యాశాఖ పేర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని