logo

ప్రజలను కొట్టడానికే అధికారంలోకి వచ్చారా..?: అమర్‌

ప్రశ్నిస్తే ప్రజలను కొట్టడానికే అధికారంలోకి వచ్చారా..? అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగంలో ప్రశ్నించడం పౌరుడి హక్కు.. ఫీజు రియంబర్స్‌మెంటు రాలేదని

Updated : 06 Aug 2022 06:04 IST

నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు

పూతలపట్టు, న్యూస్‌టుడే: ప్రశ్నిస్తే ప్రజలను కొట్టడానికే అధికారంలోకి వచ్చారా..? అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగంలో ప్రశ్నించడం పౌరుడి హక్కు.. ఫీజు రియంబర్స్‌మెంటు రాలేదని అడిగినందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని కొట్టి, తప్పుడు కేసులు పెట్టి వైకాపా నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం వేపనపల్లెలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అక్రమ అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం తెదేపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ ‘పోలీసులు జీతాలు తీసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించాలి.. జీతాలు ఇస్తోంది ప్రజలని గుర్తెరిగి ప్రజల కోసం పనిచేయాలి.. ఎపుడూ వైకాపా అధికారంలో ఉండదు.. అధికారం మారితే రోడ్లపై తిరగలేరు’ అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. పూతలపట్టులో జరిగిన నిరసనలో మొదట.. తెదేపా, జనసేన పార్టీలు వేర్వేరుగా నిరసనలు తెలిపాయి. కొద్ది సేపటికే రెండు పార్టీ జెండాలు కలిసికట్టుగా ఎగిరాయి. ఈ విషయమై విలేకరులు.. రెండు పార్టీలు ఒక్కటయ్యాయా అని ఆయన్ను ప్రశ్నించగా.. న్యాయం కోసం రెండు పార్టీలు కలిసి పోరాడతాయి.. పొత్తుల విషయం మాత్రం అధిష్ఠానం నిర్ణయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని