logo

నిలువు దోపిడీ అంటే ఇదేనేమో..!

ముక్కంటి దర్శనార్థం వచ్చే భక్తులు మళ్లీ.. మళ్లీ నిలువునా మోసాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా స్వామివారి రథానికి పక్కన దుకాణదారులు అవసరం లేకున్నా బలవంతంగా పుంగనూరుకు

Published : 09 Aug 2022 04:59 IST

దుకాణదారులపై కేసులు


సిబ్బందికి సూచనలిస్తున్న పట్టణ సీఐ అంజుయాదవ్‌

శ్రీకాళహస్తి: ముక్కంటి దర్శనార్థం వచ్చే భక్తులు మళ్లీ.. మళ్లీ నిలువునా మోసాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా స్వామివారి రథానికి పక్కన దుకాణదారులు అవసరం లేకున్నా బలవంతంగా పుంగనూరుకు చెందిన దంపతులకు రాహు, కేతు పూజల నిమిత్తం రెండు ప్రమిదలు, రెండు వత్తులు, కాస్తంత పత్రి ఇచ్చి రూ.300 వసూలు చేశారు. ఇవేమీ ఆలయ ప్రవేశ గోపురాలను దాటి లోనికి తీసుకెళ్లరన్న విషయం తెలిసినా బలవంతంగా అంటగట్టేస్తున్నారు. దీంతో చాలా మంది నిలువునా మోసాలకు గురవుతూనే ఉన్నారు. ప్రధానంగా ప్రవేశ గోపురాల వద్ద, ప్రత్యేకించి భిక్షాల గాలి గోపురం బయట ఈ తరహా బలవంతపు వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రవేశ గోపురాల వద్ద అన్నీ భాషల్లో దళారుల మోసాలకు గురికావద్దని, బయట విక్రయించే పూజా సామగ్రి ఆలయంలోకి అనుమతించర]న్న విషయాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇదే విషయమై పట్టణ సీఐ అంజుయాదవ్‌ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అవసరం లేకున్నా బలవంతంగా పూజా సామగ్రిని విక్రయించి మోసాలకు గురిచేసిన పలువురి దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఇకపై తరచూ తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని