logo

సర్దార్‌.. సుబ్బరామదాస్‌

స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌ సేనకు ముచ్చెమటలు పట్టించిన మహనీయులు ఎందరో. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు ప్రియశిష్యునిగా, శ్రీకాళహస్తి సర్దార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహనీయులు శ్రీకాళహస్తికి చెందిన....

Updated : 09 Aug 2022 06:47 IST

రైలు కూల్చి.. జైలుశిక్ష అనుభవించి
న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి


ప్రకాశం పంతులుతో సర్దార్‌ సుబ్బరామదాస్‌ (సర్కిల్‌లోని వ్యక్తి)

స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌ సేనకు ముచ్చెమటలు పట్టించిన మహనీయులు ఎందరో. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు ప్రియశిష్యునిగా, శ్రీకాళహస్తి సర్దార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహనీయులు శ్రీకాళహస్తికి చెందిన సుబ్బరామదాస్‌, ఆయన సతీమణి సుబ్బమ్మ. ఈ ఆదర్శ దంపతులు ఆంగ్లేయుల పాలనలో సాగుతున్న దమనకాండను ఎదిరించి మహోత్తర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సుబ్బరామదాస్‌ వాడవాడల్లో తిరుగుతూ ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తే ఆయన సతీమణి మహిళల్లో దేశభక్తిని పెంపొందించడంలో కంకణబద్ధులయ్యారు.

8 వీధికి నామకరణం
స్వాతంత్య్రం సిద్ధించాక సుబ్బరామదాస్‌ను భారత ప్రభుత్వం సర్దార్‌ బిరుదుతో పాటు తామ్రపత్రాన్ని ఇచ్చి సత్కరించింది. పట్టణంలో ఆయన నివాసముంటున్న వీధికి సర్దార్‌వీధిగా నామకరణం చేసింది. పౌర సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో సర్దార్‌ సుబ్బరామదాస్‌ విగ్రహం, ఆయన పోరాటాన్ని శిలాఫలకాలపై వేయించారు. ఇప్పటికీ జాతీయ పర్వదినాల సమయంలో సర్దార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి పలువురు దేశభక్తిని చాటుకుంటుండటం విశేషం.


దంపతుల కారాగార జీవితం


సర్దార్‌ సుబ్బరామదాస్‌, సుబ్బమ్మ దంపతులు

1932లో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో వీరు కీలక పాత్ర పోషించారు. 1941లో సత్యాగ్రహం చేసి 21 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి వద్ద రైలును పట్టాలు తప్పించారన్న ఆరోపణలతో సుబ్బరామదాసు నాలుగున్నర సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. కొన్నాళ్లపాటు ఆయన భార్య సుబ్బమ్మ కూడా జైలు జీవితం గడిపి స్వాతంత్య్రోద్యమంలో ఆదర్శప్రాయంగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని