logo

వైభవంగా శ్రీషిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ

చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయంలో గురువారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన, విమాన కలశస్థాపనను రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువులు మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 12 Aug 2022 05:18 IST

హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు

స్వామివారికి హారతి సమర్పిస్తున్న మోహన్‌బాబు, చిత్రంలో కుటుంబసభ్యులు

చంద్రగిరి, న్యూస్‌టుడే: చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయంలో గురువారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన, విమాన కలశస్థాపనను రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువులు మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా ఉదయం యాగశాలలో గణపతిపూజ, యజ్ఞ, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీయూ ఛాన్సలర్‌ మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దివ్యాభరణాలు, ప్రత్యేక పూజా సామగ్రిని మేళతాళాలతో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ.. దైవానుగ్రహంతో ఇన్నాళ్లకు నా కోరిక ఫలించిందని, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయం నిర్మించడం బాబా కృపతోనే సాధ్యమైందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి సాయినాథుని దర్శించుకోవాలని కోరారు. పలువురు దాతల సహకారంతో దేవాలయంతో పాటు ధ్యానమందిరం నిర్మించామన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌షిండే దంపతులు మోహన్‌బాబు దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, పద్మావతి, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, తితిదే ఈవో ధర్మారెడ్డి, శాంతాబయోటెక్‌ ఛైర్మెన్‌ వరప్రసాద్‌, సినీ దర్శకులు బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌, ముక్కామల శ్రీధర్‌స్వామి, షిరిడీ నుంచి వచ్చిన రుత్వికులు, వేదపండితులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని