logo

నవరత్నాలు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం

నవరత్నాలతో పేదల సంక్షేమానికి పాటుపడుతున్నామని, పథకాల వేగవంతంతో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.

Updated : 13 Aug 2022 05:38 IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ వెల్లడి


పథకాల అమలుపై సమీక్షిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌, పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి
నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నవరత్నాలతో పేదల సంక్షేమానికి పాటుపడుతున్నామని, పథకాల వేగవంతంతో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆర్థికేతర సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలన్నారు.  రీసర్వే పనుల్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని, అటవీ, ఇనాం, దేవదాయశాఖ భూముల్ని పరిరక్షించాలని ఆదేశించారు. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం నిమిత్తం చామంతిపురం, కృష్ణాపురం ప్రాజెక్టులపై సమీక్షించారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ ‘గడప గడప కార్యక్రమంలో 1,901 అర్జీలు అందగా.. ఇందులో పథకాలకు సంబంధించి 745 వినతులు ఉన్నాయన్నారు. కార్వేటినగరంలోని కృష్ణాపురం, పాలసముద్రం మండలం మామిడి మూలవంకలో చెరువు పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. జీడీనెల్లూరులో ఫ్లడ్‌ ఫ్లో ఛానల్‌ పనులకు టెండర్లను త్వరలోనే ఆహ్వానిస్తామన్నారు. ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్‌వో రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని