logo

ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తా...

నియోజకవర్గంలో వైకాపా నాయకులు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లను వేధిస్తున్నారు. నాలుగు రోజులుగా వైకాపా నాయకుడు చిరంజీవిరెడ్డి మద్యం తాగి సచివాలయంలోకి చొరబడి సచివాలయ సిబ్బందిని, గ్రామ వాలంటీర్లపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ

Published : 15 Aug 2022 05:02 IST

గంగుడుపల్లి సచివాలయంలో సిబ్బందిని బెదిరిస్తున్న వైకాపా నాయకుడు చిరంజీవిరెడ్డి

చంద్రగిరి: నియోజకవర్గంలో వైకాపా నాయకులు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లను వేధిస్తున్నారు. నాలుగు రోజులుగా వైకాపా నాయకుడు చిరంజీవిరెడ్డి మద్యం తాగి సచివాలయంలోకి చొరబడి సచివాలయ సిబ్బందిని, గ్రామ వాలంటీర్లపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఆపై చరవాణిలో మీరెలా ఉద్యోగాలు చేస్తారో చూస్తా అంటూ బెదిరిస్తున్నారు. మూడు రోజులకు ముందు సర్పంచి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతికుమార్‌రెడ్డి అతని అనుచరుడు చిరంజీవిరెడ్డి సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లను కార్యాలయ నుంచి బయటకు గెంటేయడంతో సిబ్బంది కార్యాలయ ఆవరణలో ధర్నాచేసి ఆపై ఎంపీడీవో రమేష్‌బాబుకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో సిబ్బందిపై కక్షగట్టిన వైకాపా నాయకులు వాలంటీర్లకు ఫోన్‌చేసి సోమవారం నుంచి మీరెలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ బెదిరిస్తుండటంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారులు, మండల స్థాయి నాయకులను ఆశ్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని