logo

‘నాలుడు- నేడు’ పనుల్లో విద్యార్థు

శాంతిపురం మండలంలోని సి.బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నాడు-నేడు పనుల్లో విద్యార్థులు పాల్గొన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ద్వారా తరగతి గదుల వసతికి రూ.1.08 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Published : 25 Sep 2022 02:31 IST

నాడు- నేడు తరగతి గదుల సిమెంటు పనులు చేస్తున్న విద్యార్థులు

కుప్పం, న్యూస్‌టుడే: శాంతిపురం మండలంలోని సి.బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నాడు-నేడు పనుల్లో విద్యార్థులు పాల్గొన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ద్వారా తరగతి గదుల వసతికి రూ.1.08 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మట్టి పనులు పూర్తి చేసి సిమెంటుతో పునాదుల నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణ పనుల్లో విద్యార్థులు పాల్గొన్న ఫొటోలను కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంగా ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు జానకిరామన్‌ను వివరణ కోరగా.. పాఠశాలకు సంబంధించిన పారలు, గునపాలను కూలీలు పునాదులకు వినియోగించగా వాటిని తీసుకొచ్చి పాఠశాలలో భద్రపరచేందుకు నిర్మాణ పనుల వద్దకు విద్యార్థులు వెళ్లగా.. స్థానికంగా ఓ వ్యక్తి ఫొటోలు తీశారని తెలిపారు. విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎంఈఓతోపాటు ఇతర అధికారులకు తెలియజేశానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని