logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

మండల పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. భగత్‌సింగ్‌ కాలనీ నుంచి పలమనేరు వైపు వెళ్లే బైపాస్‌రోడ్డులో రాజులూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.

Published : 25 Sep 2022 02:31 IST

నారాయణ (పాతచిత్రం)

పుంగనూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. భగత్‌సింగ్‌ కాలనీ నుంచి పలమనేరు వైపు వెళ్లే బైపాస్‌రోడ్డులో రాజులూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. పెద్దపంజాణి మండలం పాత మాదనపల్లెకు చెందిన ఎం.నారాయణ(50) మృతి చెందగా, అతని కుమార్తె మాన్యశ్రీ స్వల్ప గాయాలతో బయటపడింది. నిమ్మనపల్లె కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న ఆమెను దసరా సెలవుల కోసం ఇంటికి తీసుకొస్తుండగా సంఘటనా స్థలంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొన్నాడు. ఈ సమయంలో ఆ మార్గంలో వస్తున్న చౌడేపల్లె ఎస్సై రవికుమార్‌ గమనించి వెంటనే ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా నారాయణ మృతి చెందాడు. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే నారాయణ పిల్లల చదువు కోసం అహర్నిశలు శ్రమించేవాడని గ్రామస్థులు విలపించారు.
‌్ర మండలంలోని పాలెంపల్లె సమీపంలోని కుక్కలపల్లె వద్ద బొలేరో-ద్విచక్రవాహనం ఢీకొని ద్విచక్రవాహనదారుడు నల్లతంబి(50) అక్కడికక్కడే మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన అతను రెండేళ్లగా ఇక్కడే రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగానే గల క్వారీలో పనిచేసేవాడు. బొలేరో వాహనంలో వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కారు ఢీకొని వ్యక్తి మృతి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టపల్లె వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్‌ కథనం మేరకు.. కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న జయచంద్ర(45)ను ఎదురుగా శాంతిపురం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ద్విచక్ర వాహనచోదకుడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కడప జిల్లా పులివెందులకు చెందిన జయచంద్ర కుమార్తె పీఈఎస్‌ ఆస్పత్రిలో మెడిసిన్‌ చదువుతుండగా, కుప్పం పట్టణంలో నివాసం ఉంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని