logo

ప్రశాంతత.. గుండె భద్రత

ఒకప్పుడు 40-50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే గుండెపోటు.. ప్రస్తుతం  చిన్న వయసుల వారికీ  వస్తోంది. సంప్రదాయ ఆహార  పద్ధతులు విస్మరించడం.. నోటికి రుచికరమైన ఆహారం దొరకగానే మోతాదుకు మించి తీసుకోవడం.. తీసుకున్న ఆహారం

Published : 29 Sep 2022 04:56 IST

రోజూ వ్యాయామం అవసరమంటున్న వైద్యులు

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

న్యూస్‌టుడే, తిరుపతి(వైద్యం)

* చిత్తూరు జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు వచ్చి స్విమ్స్‌ ఆస్పత్రికి వచ్చారు. స్టంట్‌ వేసినా.. రెండేళ్ల తర్వాత చనిపోయారు. ఒక్కగానొక్క కొడుకు అడిగిన వెంటనే బయటి ఆహారం(జంక్‌ ఫుడ్‌, చికెన్‌ పకోడి, బకెట్‌ చికెన్‌) తెచ్చి ఇవ్వడమే కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం.

* ఆరు నెలలుగా అత్తారింటి వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాకు చెందిన వివాహిత(25) ఒత్తిడికి గురైంది. గుండెపోటు రావడంతో స్విమ్స్‌ ఆస్పత్రిలో చేరింది. తల్లిదండ్రులు గారాభంగా పెంచారే గానీ.. జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఆమెలో తీసుకురాలేకపోయారు.  

కప్పుడు 40-50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే గుండెపోటు.. ప్రస్తుతం  చిన్న వయసుల వారికీ  వస్తోంది. సంప్రదాయ ఆహార  పద్ధతులు విస్మరించడం.. నోటికి రుచికరమైన ఆహారం దొరకగానే మోతాదుకు మించి తీసుకోవడం.. తీసుకున్న ఆహారం ఖర్చు అయ్యేలా వ్యాయామం చేయకపోవడం.. దానికితోడు చెడు అలవాట్లు.. చేసిన పొరపాట్లపై  ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు. కొవిడ్‌ అనంతరం హృద్రోగుల సంఖ్య పెరుగుతోంది.


క్యాలరీలు  కరిగించుకుంటేనే..

బాగా తింటే ఆరోగ్యంగా ఉంటామనే భ్రమలో ప్రజలు ఉన్నారు. తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలో పెరిగిన క్యాలరీలు ఎప్పటికప్పుడు వ్యాయామం ద్వారా కరిగించుకోవాలి. వ్యాధి లక్షణాలు.. చికిత్స విధానం గురించి ప్రజల్లో చైౖతన్యం రావాలి. 40 ఏళ్లలోపు వారు ఏటా గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వయసున్న వారు నిత్య వ్యాయామం.. ప్రతి మూడు నెలలకోసారి ఈసీజీ, ఆరు నెలలకోసారి ఏకో, టీఎంటీ పరీక్షలు చేసుకోవాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తే హృద్రోగ బాధితులను 80 శాతం వరకు తగ్గించవచ్చు.

అందుబాటులో వైద్యసేవలు
తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు, స్టంట్‌ అమర్చడం, యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోబోటిక్‌ సర్జరీలు సైతం దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు కార్డియాలజి ఆస్పత్రుల్లో ల్యాబ్‌ సదుపాయాలు ఉన్నాయి.


సరైన జీవన విధానంతో ఆరోగ్యం
-  వి.వనజాక్షమ్మ, సీనియర్‌ గుండె వైద్య నిపుణురాలు, స్విమ్స్‌

సంప్రదాయ ఆహారపు అలవాట్లు.. మానసిక ప్రశాంతత.. సరైన జీవన విధానంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. నిత్యం యోగా, ధ్యానం, వ్యాయామంతో హృద్రోగ సమస్యల నుంచి దూరం కావచ్చు. రోజువారీ తీసుకున్న ఆహారాన్ని వ్యాయామం ద్వారా ఖర్చు చేయగలిగితే గుండె, లివర్‌, చర్మం కింద కొవ్వు చేరకుండా ఉంటుంది.

Read latest Chittoor News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు