logo

వెన్నుపోటుదారులను సహించేదిలేదు: డిప్యూటీ సీఎం

వైకాపాలో వెన్నుపోటుదారులు ఎంతటివారైనా సహించేది లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. పెనుమూరులో వైఎస్సార్‌ చేయూత కింద 1,932మంది

Updated : 30 Sep 2022 03:41 IST

చెక్కు అందజేస్తున్న ఉపముఖ్యమంత్రి

పెనుమూరు, న్యూస్‌టుడే: వైకాపాలో వెన్నుపోటుదారులు ఎంతటివారైనా సహించేది లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. పెనుమూరులో వైఎస్సార్‌ చేయూత కింద 1,932మంది లబ్ధిదారులకు గురువారం రూ.3.62కోట్ల విలువైన చెక్కు అందజేశారు. పార్టీలో ఉంటూ.. పార్టీకి ద్రోహం చేసేవారిని అధినాయకత్వం వదిలిపెట్టదన్నారు. జగనన్న పేదల తలరాత మారిస్తే తాను అందరికీ బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తానని చెప్పారు. ఎవరైనా ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. అలాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చన్నారు. ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, చిత్తూరు ఉపమేయర్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, వైకాపా మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు యశోదారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పయని, జమున, వైకాపా జిల్లా కార్యవర్గ సభ్యుడు దూదిమోహన్‌, ఎంపీడీవో శివయ్య, తహసీల్దారు రమణి, ఏపీఎం హరికృష్ణారెడ్డి, ఏపీవో గుణశేఖర్‌ పాల్గొన్నారు.

జ్ఞానేంద్ర వర్గం గైర్హాజరు.. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐ సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, ఆయన వర్గీయులు హాజరు కాలేదు. కొద్దికాలంగా డిప్యూటీ సీఎం, మాజీ ఎంపీ నడుమ అంతర్గత పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ హేమలత, జడ్పీటీసీ దొరస్వామి, పార్టీ మండల కన్వీనర్‌ సురేష్‌రెడ్డి, తొమ్మిది మంది ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం సభలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని