logo

‘బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం’

చిత్తూరులో బయటపడి సంచలనం రేపిన నకిలీ రిజిస్ట్రేషన్‌ వ్యవహారమై స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రారు శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే

Updated : 30 Sep 2022 03:42 IST

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: చిత్తూరులో బయటపడి సంచలనం రేపిన నకిలీ రిజిస్ట్రేషన్‌ వ్యవహారమై స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రారు శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే శాఖా పరంగా అంతర్గతంగా విచారణ జరిపిస్తామన్నారు. తమ సిబ్బంది పొరపాట్లు చేసినట్లు నిరూపితమైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇప్పటివరకు బాధితులు ఎవరూ తమకు నేరుగా ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు.

* నకిలీ రిజిస్ట్రేషన్‌ ఉదంతం నేపథ్యంలో తాలిమా అనే మహిళ స్టాంపు వెండర్‌ లైసెన్స్‌ను స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆమె నకిలీ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో పట్టుబడిన సురేంద్రబాబు భార్య. ఆమె వద్దనున్న స్టాంపు పత్రాలు, స్టాకు పుస్తకం, సేల్స్‌ రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకోవాలని చిత్తూరు రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.


ఎన్‌ఎంఎంఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈవో పురుషోత్తం గురువారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులన్నారు. అక్టోబరు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుం చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్‌సైట్‌ ‌్ర్ర్ర.్జ(’.్చ్ప.్ణ్న‌్ర.i- గానీ, జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని గానీ సంప్రదించాలని ఆయన కోరారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని