logo

భవితకు భరోసా

చంద్రగిరిలోని బాలికల జూనియర్‌ కళాశాల ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వానికి దాతల సహకారం తోడై వసతులు సమకూర్చుకుంటోంది. ఇక్కడ చదివిన

Published : 30 Sep 2022 02:19 IST

ఆదర్శం.. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల

దాతల ఔదార్యం

కళాశాల ఆవరణలో పచ్చనిచెట్లు

చంద్రగిరిలోని బాలికల జూనియర్‌ కళాశాల ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వానికి దాతల సహకారం తోడై వసతులు సమకూర్చుకుంటోంది. ఇక్కడ చదివిన విద్యార్థినులు సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్నారు. కళాశాలలోని వృత్తి విద్యా కోర్సులు అభ్యసించిన వారు పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

న్యూస్‌టుడే, చంద్రగిరి

చంద్రగిరిలో 1982లో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. విద్యార్థినుల సంఖ్య ఏటా పెరుగుతూ.. ప్రస్తుతం 855 మంది చదువుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష పలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో కళాశాల 70 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. 1920-21 విద్యా సంవత్సరంలో ఆరుగురు, 1921-22లో పదిమంది ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్‌ సీట్లు సాధించారు. గతంలో ఇక్కడ చదువుకుని ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన పూర్వ విద్యార్థినులు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు. సంవత్సరం పరీక్షలకు ఆరు నెలలకు ముందు నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థినులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

వృత్తివిద్యా కోర్సులు
కళాశాలలో వృత్తివిద్యా కోర్సులు ప్రవేశపెట్టారు. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌(ఎంపీహెచ్‌డబ్ల్యూ)లో శిక్షణ పొందిన విద్యార్థినులు ఏటా సుమారు 20 మంది వరకు రుయా, స్విమ్స్‌, ప్రసూతి  ఆసుపత్రిల్లో నర్సింగ్‌ కోర్సుల్లో సీట్లు సాధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీస్‌  అసిస్టెంట్స్‌(ఓఏ), కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ(సీజీటీ)లో ప్రావీణ్యం సాధిచిన విద్యార్థులు ఆయారంగాల్లో రాణిస్తున్నారు.

ఎన్నో వసతులు
రాజన్నట్రస్టు, అమరరాజా బ్యాటరీస్‌ సంయుక్తంగా 2009లో రూ.15 లక్షలు వెచ్చించి నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించారు. పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి.. తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్సీ రెడ్డివారి నాథమునిరెడ్డి జ్ఞాపకార్థం రూ.5 లక్షలతో కళావేదిక నిర్మించారు. ప్రిన్సిపల్‌ జి.రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థనతో గుత్తేదారు రాజులుగారి మనోహర్‌రెడ్డి రూ.2 లక్షలతో కళాశాలకు ప్రహరి, కళావేదిక ప్రాంగణంలో రూ.3 లక్షల వ్యయంతో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ నిర్మించారు. పదవీ విరమణ పొందిన కెమిస్ట్రి అధ్యాపకులు రాజేంద్రప్రసాద్‌ మినరల్‌వాటర్‌ యంత్రాలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ రాజశేఖరెడ్డి కళాశాల అభివృద్ధికోసం అధ్యాపకుల్ని భాగస్వాములను చేసి కళాశాల ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న వసతిగృహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. విశ్రాంత హిందీ పండిట్‌ వెంకటరెడ్డి రూ.లక్ష వెచ్చించి కళాశాల సిబ్బంది, విద్యార్థినుల వాహనాలు ఉంచుకోడానికి రేకుల షెడ్డు నిర్మించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని